సూపర్ భామల సూపర్ ఫ్రెండ్షిప్
- April 13, 2022లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం ‘కాతువాకులు రెండు కాదల్’ ఈనెల 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అయింది..విజయ్ సేతుపతి హీరోగా నటించిన ఈ చిత్రంలో మరో సౌత్ స్టార్ హీరోయిన్ సమంత రెండో హీరోయిన్ గా నటించింది. నయనతార బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విఘ్నేష్ శివన్ నయనతార, లలిత్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. తొలిసారిగా నయనతార, సమంత కలిసి నటించిన చిత్రమిది.
రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో నయనతార , సమంత మధ్య సన్నివేశాలు ప్రధాన హైలైట్ గా ఉంటాయని అంటున్నారు. ఇదిలా ఉండగా, ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే సామ్ – నయన్ మధ్య మంచి అనుబంధం ఏర్పడి, అది కాస్తాఇపుడు డీప్ ఫ్రెండ్షిప్ గా మారిందని అంటున్నారు. . ఇటీవల జరిగిన నయనతార పుట్టిన రోజు వేడుకల్లో సమంత పాల్గొన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..