మే 20న భారీ విడుదలకు సిద్ధంగా ఉన్న ‘గాడ్సే’
- April 13, 2022
వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో సి.కె.స్క్రీన్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘గాడ్సే’.. మే 20న భారీ విడుదల
వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న వెర్సటైల్ హీరో సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గాడ్సే’. గోపి గణేష్ పట్టాభి దర్శకుడు. ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్‌లో ‘బ్లఫ్ మాస్టర్’ వంటి సూపర్ హిట్ మూవీ రూపొందిన సంగతి తెలిసిందే. మరోసారి ఈ హిట్ కాంబో కలిసి చేస్తోన్న గాడ్సే చిత్రంపై టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక టీజర్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఈ సినిమాను మే 20న గ్రాండ్ లెవల్లో విడుదల చేయబోతున్నట్లు నిర్మాత సి.కళ్యాణ్ తెలిపారు. గాడ్సే సినిమాను డైరెక్ట్ చేయటంతో పాటు ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలను కూడా గోపి గణేష్ అందిస్తున్నారు.
అవినీతిమయమైన రాజకీయ నాయకుడిని, వ్యవస్థను ఒంటి చేత్తో ఎదుర్కొనే ధైర్యవంతుడైన యువకుడి పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నారు. ఐశ్వర్య లక్ష్మి ఇందులో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా కనిపించనుంది.
ఈ చిత్రాన్ని సి.కె.స్క్రీన్స్ బ్యానర్‌పై ప్రముఖ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నాజర్, షాయాజీ షిండే, కిషోర్, ఆదిత్య మీనన్, బ్రహ్మాజీ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజా వార్తలు
- విద్యుత్, ఇంధన రంగంలో పెట్టుబడులు.. ఆకర్షణీయ దేశాలు ఇవే..!!
- 8 ఏళ్ల తర్వాత మనామా సూక్ గేట్‌వే ఆర్ట్ వర్క్ తొలగింపు..!!
- గుండెను పదిలంగా చూసుకోండి: డాక్టర్ పి. చంద్రశేఖర్
- కువైట్ మునిసిపాలిటీ తనిఖీలు..వాహనాలు తొలగింపు..!!
- ప్రపంచ దేశాల్లో యోగాకి ప్రత్యేక గుర్తింపు..
- ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగానికి గైడ్ లైన్స్ అవసరం..!!
- ఇటాలియన్ అధికారులకు క్రిమినల్ అప్పగింత..!!
- నాలుగు కొత్త విజిట్ వీసా కేటగిరీలను ప్రకటించిన యూఏఈ..ఎంట్రీ పర్మిట్‌లో సవరణలు..!!
- సింగపూర్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు