మార్చిలో 15 ఏళ్ళ గరిష్టాన్ని తాకిన దుబాయ్ హోటల్ ఆక్యుపెన్సీ

- April 13, 2022 , by Maagulf
మార్చిలో 15 ఏళ్ళ గరిష్టాన్ని తాకిన దుబాయ్ హోటల్ ఆక్యుపెన్సీ

దుబాయ్‌: ఈ మార్చి నెలలో దుబాయ్‌లో హోటల్ ఆక్యుపెన్సీ 15 ఏళ్ళ గరిష్టాన్ని తాకింది. 90 శాతం ఆక్యుపెన్సీ నమోదయినట్లు దుబాయ్ హోటల్ ఇండస్ట్రీ తెలిపింది. 2007 మార్చి తర్వాత ఈ స్థాయిలో ఆక్యుపెన్సీ నమోదవడం ఇదే తొలిసారి. ఎక్స్‌పో 2020 కారణంగానే ఈ ఆక్యుపెన్సీ నమోదయ్యింది. ఎక్స్‌పో 2020 కారణంగా 24 మిలియన్ సందర్శనలు ఆరు నెలల్లో చోటు చేసుకున్నాయి. ఎస్‌టిఆర్ లెక్కల ప్రకారం ఆక్యుపెన్సీ లెవల్ 91.7 శాతం చేరుకుంది. రోజువారీ సరాసరి రేటు 891.46గా వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com