ఐదు భాషల్లో 'ల్యాండ్‌మార్క్స్ ఫ్రమ్ ది టూ హోలీ మాస్క్స్' పుస్తకం
- April 14, 2022
సౌదీ: మక్కాలోని రెండు పవిత్ర మస్జీదుల విశేషాలను తెలిపే "ల్యాండ్‌మార్క్స్ ఫ్రమ్ ది టూ హోలీ మాస్క్స్" పుస్తకాన్ని రెండు పవిత్ర మసీదుల వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ ప్రెసిడెంట్ షేక్ డాక్టర్ అబ్దుల్రహ్మాన్ అల్-సుదైస్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ఐదు భాషల్లోకి అనువదించారు. ఉర్దూ, పర్షియన్, మలావి, ఫ్రెంచ్, ఇంగ్లిష్ భాషల్లో ఈ పుస్తకం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ పుస్తకంలో పవిత్ర కాబా, బ్లాక్ స్టోన్, యెమెన్ కార్నర్ (అల్-రుక్న్ అల్-యమాని), పవిత్ర కాబా కీ, తాళం, దాని వస్త్రం, మిజాబ్ (వాటర్ స్పౌట్), హతీమ్ (పవిత్ర కాబా యొక్క దిగువ గోడ) సమాచారం ఉంది. మకామ్ ఇబ్రహీం, అల్-షతర్వాన్, అల్-సఫా వా అల్-మర్వా, ప్రదక్షిణ (తవాఫ్) ప్రాంతం, జంజామ్ బావి, గ్రాండ్ మస్జీదు ద్వారాలు, మస్జీదును విస్తరించే, నిర్మించే దశల వివరాలు ఉన్నాయి. సందర్శకులు, అతిథులకు అన్ని భాషలలో రెండు పవిత్ర మస్జీదుల వివరాలను అందించడానికి ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినట్లు షేక్ అల్-సుడైస్ తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!