బాషర్-అమెరత్ రోడ్డుపై ప్రమాదం.. ఇద్దరు మృతి
- April 14, 2022
మస్కట్ : బాషర్-అమెరత్ రహదారిపై బుధవారం మూడు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. ఈ మేరకు మస్కట్ - రాయల్ ఒమన్ పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా రోడ్డుపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మస్కట్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ జామ్‌లకు పరిష్కారంగా మరిన్ని రహదారులను నిర్మించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. అయినా బాషర్-అమెరత్ రహదారిపై ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రహదారిపై ప్రమాదాలను నివారించేందుకు అత్యవసర ప్రాతిపదికన శాశ్వత పరిష్కారం ప్రత్యామ్నాయ రహదారి లేదా అమెరత్ -బాషర్ విలాయత్‌లను కలిపే సొరంగం నిర్మించాలని స్థానికి ప్రయాణికులు కోరుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 1న దుబాయ్ ఫౌంటెన్ రీ ఓపెన్..!!
- ఒక నెలలో 53 మిలియన్లకు పైగా యాత్రికులు..!!
- వద్ద ఒమన్ క్రెడిట్ రేటింగ్ 'BBB-'..!!
- 2029 పురుషుల వాలీబాల్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఖతార్ ఆతిథ్యం..!!
- వరల్డ్ ఫుడ్ ఇండియాతో గ్లోబల్ పార్టనర్ షిప్..!!
- బహ్రెయిన్‌లో తొలి వెటర్నరీ మెడిసిన్ కాన్ఫరెన్స్ సక్సెస్..!!
- శంకర నేత్రాలయ డెట్రాయిట్ 5K వాక్ ఘనంగా ముగిసింది
- మూసీ ఉగ్రరూపం చూశారా..
- హైదరాబాద్ కమిషనర్‌గా సజ్జనార్
- ఒమన్, కువైట్‌తో ఖతార్ సహకారం బలోపేతం..!!