'ప్రధానమంత్రి సంగ్రాహాలయ' ను ప్రారంభించిన మోదీ

- April 14, 2022 , by Maagulf
\'ప్రధానమంత్రి సంగ్రాహాలయ\' ను ప్రారంభించిన మోదీ

న్యూ ఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ప్రధానమంత్రి సంగ్రహాలయ (Prime Minister’s Museum)ను ప్రారంభించారు. స్వాతంత్య్రం అనంతరం ప్రధానిగా బాధ్యతలు అందుకున్న వారికి గుర్తుగా దీనిని నిర్మించినట్లు పేర్కొన్నారు.

పదవీకాలంతో సంబంధం లేకుండా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా.. దీనిని ప్రారంభించారు. స్వాతంత్య్రం తర్వాత భారత పరిస్థితులు వాటిని చక్కదిద్దేందుకు ప్రధానులు చేసిన సేవలను ఇక్కడ ఉంచనున్నారు.

ప్రధానుల నాయకత్వం, దార్శనికత, విజయాల గురించి యువ తరానికి అవగాహన కల్పించడంతో పాటు ప్రేరేపించడమే లక్ష్యంగా రూపొందించారు. 'ప్రధానమంత్రి సంగ్రహాలయ' ప్రారంభోత్సవంలో భాగంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తొలి టిక్కెట్‌ను కొనుగోలు చేసి మ్యూజియాన్ని సందర్శించారు.

'ప్రధానమంత్రి సంగ్రహాలయ' టికెట్ ధర ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ. 100, భారతీయులకు ఆఫ్‌లైన్ మోడ్‌లో రూ. 110 అయితే విదేశీయులకు మాత్రం దీని ధర రూ. 750వరకూ ఏర్పాటు చేశారు.

5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోడ్‌లలో టిక్కెట్లు కొనుగోలు చేస్తే 50 శాతం రాయితీ ఇస్తారు. కాలేజీ, హైస్కూల్ విద్యార్థులు బుకింగ్‌లపై 25 శాతం తగ్గింపు పొందొచ్చు.

మ్యూజియం చిహ్నం.. జాతీయతను, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేలా ధర్మ చక్ర గుర్తును చేతులతో పట్టుకున్నట్లుగా లోగోను సిద్ధం చేశారు. మ్యూజియంలో మొత్తం 43గ్యాలరీలను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర పోరాటం నుంచి దేశాభివృద్ధి కోసం పలువురు ప్రధానులు ఎదుర్కొన్న సవాళ్లను ఇక్కడ పొందుపరిచారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com