గ్యాస్ ఫీల్డ్ విషయమై ఇరాన్‌ని చర్చలకు ఆహ్వానించిన సౌదీ, కువైట్

- April 14, 2022 , by Maagulf
గ్యాస్ ఫీల్డ్ విషయమై ఇరాన్‌ని చర్చలకు ఆహ్వానించిన సౌదీ, కువైట్

సౌదీ అరేబియా అలాగే కువైట్, డోర్రా నేచురల్ గ్యాస్ ఫీల్డ్‌లో తమకున్న న్యాయపరమైన హక్కుల విషయంలో తాము స్పష్టంగా వున్నామని పేర్కొన్నాయి. ఈ మేరకు సౌదీ ప్రెస్ ఏజెన్సీ, కువైట్ న్యూస్ ఏజెన్సీ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ విషయమై కువైట్‌తో చర్చలకు సిద్ధంగా వున్నట్లు తెలిపాయి. మార్చి 21న సౌదీ అరేబియా అలాగే కువైట్, డోర్రా ఫీల్డ్‌లో నిక్షేపాల విషయమై పరస్పర ఒప్పందం చేసుకున్నాయి. సరిహద్దు నిర్ణయానికి సంబంధించి ఇరాన్ చర్చలకు రావాలని ఇరు దేశాలూ ఆహ్వానిస్తున్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com