యూఏఈ: భిక్షాటన చేయించినా, చేసినా..Dh100,000 జరిమానా.. 6నెలల జైలు!
- April 15, 2022
అబుధాబి:యూఏఈ ప్రభుత్వం భిక్షాటన విషయమై తాజాగా చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇకపై దేశంలో ఎవరైనా బయటి దేశాల వారిని నియమించుకుని(ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందిని) భిక్షాటన చేయిస్తే 100,000 దిర్హాములు జరిమానాతో పాటు 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ గురువారం వెల్లడించింది.అలాగే భిక్షాటన చేసిన వారికి కూడా ఇదే శిక్ష వర్తిస్తుందని స్పష్టం చేసింది.ఈ విషయాన్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది.ఫెడరల్ డిక్రీ-లా నం.31 ఆఫ్ 2021లోని ఆర్టికల్ 477 ప్రకారం ఈ జరిమానా, జైలు శిక్షలను అమలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ గుర్తు చేసింది. ముఖ్యంగా పవిత్ర రమదాన్ మాసంలో దేశంలో భిక్షాటన చేసే వారి పై యూఏఈ ప్రభుత్వం ప్రతియేటా ఉక్కుపాదం మోపుతోంది.ఈ క్రమంలోనే ఇటీవల భారీ సంఖ్యలో బిచ్చగాళ్లను అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







