అరుదైన చికిత్స చేసిన మెడికవర్ వైద్యులు

- April 16, 2022 , by Maagulf
అరుదైన చికిత్స చేసిన మెడికవర్ వైద్యులు

హైదరాబాద్: జగిత్యాల జిల్లా నుంచి 21  సంవత్సరాల ప్రవల్లిక ఏడు నెలల గర్భవతి అతి తక్కువ ప్లేట్లెట్ కౌంట్ వలన వేరే హాస్పిటల్స్ చేర్చుకోము అంటే చివరిగా మెడికవర్ హాస్పిటల్స్ అత్యవసర విభగానికి తీసుకొనిరావడం డాక్టర్ నీతి మాలా ఆధ్వర్యంలో జాయిన్ చేయడం జరిగింది.అనంతరం పరీక్షలు నిర్వహించగా ఆమెకు ప్లేట్‌లెట్ కౌంట్ 1000 ఉన్నాయి మరియు  O నెగటివ్ బ్లడ్ గ్రూప్ అని గుర్తించడం జరిగింది.సాధారణంగా ఈ ప్రెగ్నన్సీ ని మనం RH నెగటివ్ ప్రెగ్నన్సీ అని పిలుస్తాం.ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇటువంటి రక్తం ప్రతి 100 మందిలో 7 గురికి మాత్రమే ఉంటుంది.

డాక్టర్ నీతి మాలా (ప్రసూతి వైద్య నిపుణురాలు & గైనకాలజిస్ట్) నిర్వహించిన తదుపరి పరీక్షలో, ఆమెకు దీర్ఘకాలిక ITP (ఇమ్యునోలాజికల్ డిజార్డర్) ఉన్నట్లు గుర్తించడం జరిగింది.ఇది 10000 మంది గర్భవతులలో ఒక్కరికి వచ్చే వ్యాధి. ఇమ్యూన్ థ్రోంబోసైటోపెనియా (ITP) అనేది రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య తగ్గడం ద్వారా వచ్చే రక్త రుగ్మత. ప్లేట్‌లెట్స్ అనేవి  రక్తంలోని కణాలు, ఇవి రక్తస్రావం ఆపడానికి సహాయపడతాయి.ప్లేట్‌లెట్ కౌంట్ తక్కువగా ఉన్నందున రక్తస్రావం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.సాధారణంగా ప్లేట్లెట్స్ గర్భిణీలకు 100000 (లక్ష) పైనే ఉండాలి.కాని ఈ యొక్క పేషెంట్ లో 1000 (వెయ్యి) మాత్రమే ఉన్నాయి.పేషెంట్ కి ఆపరేషన్ చేస్తే రక్థస్రావం ఆపడం కష్టం ఈ సమయంలో మరియు తదుపరి చేసిన యాంటీనాటల్ యుఎస్‌జి పరీక్షలో అమ్నియోటిక్ ద్రవం(ఉమ్మనీరు) తక్కువగా ఉన్నది  మరియు శిశువు గుండె కొట్టుకోవడంలో తేడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు శిశువు ని బయటికి తీయడం చాలా ముఖ్యం మరోపక్క 1000 ప్లేట్లెట్స్ తో ఉన్న తల్లి ప్రాణాలు కాపాడటం సవాలుతో కూడుకున్నది.ఇది చాలా హైరిస్క్ తో కూడుకున్న ప్రెగ్నన్సీ. ఇద్దరిలో ఎవరినో ఒక్కర్ని  మాత్రమే కాపాడగలుతారు.

ఇది చాలా కఠినమైన సమయం వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బైటికి తీయాలి,ఆలస్యం చేస్తే తల్లి బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అని డాక్టర్ నీతి మాలా పేషెంట్ తల్లిదండ్రులకి వివరంచడం జరిగింది.
ఈ సమయంలో  డాక్టర్ నీతి మాలా ఇది సవాలుగా తీసుకోని ఇద్దర్ని కాపాడాలి అని పేషెంట్ కి ఆపరేషన్ చేయడానికి నిర్ణయించుకున్నది.మొదటగా పేషెంట్ కి ఒక పక్క ప్లేట్లెట్స్ మరియు మెడిసిన్స్ ఎక్కించుకుంటూ  (ఇంట్రాఆపరేటివ్ రక్త నష్టం ఊహించబడింది కాబట్టి ) డెలివరీ చేసి పాపా ప్రాణాలను కాపాడటం జరిగింది.

శిశువు యొక్క ప్లేట్‌లెట్ కౌంట్ కూడా తక్కువ ఉండటం వలన సుమారు 4 రోజుల పాటు శిశువైద్యుని (పిడియాట్రిషన్) సంరక్షణలో NICUలో ఉంచడం జరిగింది.
డాక్టర్ కిరణ్మయి - జనరల్ ఫిజిషియన్ ఆధ్వర్యంలో సకాలంలో తల్లికి  స్టెరాయిడ్స్ ఇవ్వడంవలన ఆమెకి  రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ పెరిగింది.డాక్టర్ నీతి మాలా మాట్లాడుతూ ఇటువంటి రుగ్మతలు ఉన్న గర్భిణీలు (హైరిస్క్ ప్రెగ్నన్సీలు) సరైన హాస్పిటల్స్ & డాక్టర్స్ని ఎంచుకోవడం మరియు వారి పర్యవేక్షణలో మందులు వాడటం ఎంతో మంచిది.
తల్లి మరియు బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. తల్లిదండ్రుల ఇద్దరూ తమ సకాలంలో నిర్ణయం మరియు చికిత్స కోసం మెడికవర్ హాస్పిటల్స్ రావడం వలన ఈ రోజు ఇద్దరి ప్రాణాలు మరియు కుటుంబం అంత సంతోషంగా ఉన్నారు.ఈ యొక్క అరుదైన శస్త్రచికిత్సలో వీరికి అనెస్థీషియాలోజిస్ట్ మరియు క్రిటికల్ కేర్ హెడ్ డాక్టర్ విశ్వేశ్ సహాయపడ్డారు.
పేషెంట్ మరియు వారి కుటుంబసభ్యులు డాక్టర్‌లకు తమ కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com