లోపాలతో కూడిన ఎయిర్ బ్యాగ్స్: 30,000 బహ్రెయినీ దినార్లు చెల్లించనున్న కార్ డీలర్‌షిప్

- April 19, 2022 , by Maagulf
లోపాలతో కూడిన ఎయిర్ బ్యాగ్స్: 30,000 బహ్రెయినీ దినార్లు చెల్లించనున్న కార్ డీలర్‌షిప్

బహ్రెయిన్: హై అడ్మినిస్ట్రేషన్ కోర్టు, ఓ కార్ డీలర్‌షిప్ లోపాలతో కూడిన ఎయిర్ బ్యాగ్స్ నిమిత్తం 30,000 బహ్రెయినీ దినార్ల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఓ కారు ప్రమాదానికి గురి కాగా, లోపాలున్న ఎయిర్ బ్యాగ్స్ ఆ సమయంలో ఓ వ్యక్తిని కాపాడలేకపోయాయి. ఈ ఘటనలో ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఫోరెన్సిక్ నివేదికలో ఈ విషయం వెల్లడయ్యింది. మృతుడి సంబంధీకులకు ఫోరెన్సిక్ సమాచారమివ్వగా, ఆ సమాచారం ఆధారంగా సదరు కార్ డీలర్‌షిప్‌పై ఫిర్యాదు చేశారు. విచారణ సందర్భంగా తేలిన విషయమేంటంటే, లోపాన్ని గుర్తించిన సంస్థ, చెకప్ కోసం రావాల్సిందిగా కొనుగోలుదారుకి సమాచారమిచ్చినప్పటికీ, లోపం గురించి స్పష్టంగా పేర్కొనలేదని తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com