గోల్డెన్ వీసా స్కీమ్‌కి కొత్త సవరణలు
- April 19, 2022
యూఏఈ: యూఏఈ గోల్డెన్ వీసా స్కీమ్‌కి సంబంధించి కొన్ని సవరణలు చేయడం జరిగింది. వీటి ద్వారా లబ్దిదారులకు సంబంధించిన కేటగిరీలను విస్తరించారు. అలాగే అర్హత కేటగిరీల్లోనూ సులభతరమైన అంశాల్ని పొందుపరిచారు. వీసా పొందినవారు దేశం వెలుపల ఎన్నాళ్ళయినా వుండొచ్చు. అది వారి రెసిడెన్సీపై ప్రభావం చూపదు. 10 ఏళ్ళ రెసిడెన్సీ ఇన్వెస్టర్లకు, వ్యాపారవేత్తలకు, ప్రత్యేకమైన టాలెంట్స్ వున్నవారికి, సైంటిస్టులు, ప్రొఫెషనల్స్, ప్రతిభ గల విద్యార్థులకు అలాగే గ్రాడ్యుయేట్లకు, హ్యుమానిటేరియన్ పయోనీర్స్, ఫ్రంట్‌లైన్ హీరోస్.. ఈ కేటగిరీలో వుంటారు. సవరణల నేపథ్యంలో గోల్డెన్ వీసా కలిగినవారు తమ కుటుంబ సభ్యుల్ని స్పాన్సర్ చేసుకోవచ్చు.. వయసుతో సంబంధం లేకుండా. సంఖ్యతో సంబంధం లేకుండా సపోర్ట్ సర్వీసెస్ కోసం స్పాన్సర్ చేసుకోవచ్చు. గోల్డెన్ వీసా కలిగిన వ్యక్తి ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబ సభ్యులు యూఏఈలో నివసించేందుకు అవకాశం కల్పిస్తారు.
తాజా వార్తలు
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక







