ఖురాన్ దహనం: స్వీడిష్ అతివాదుల చర్యను ఖండించిన ఒమన్

- April 19, 2022 , by Maagulf
ఖురాన్ దహనం: స్వీడిష్ అతివాదుల చర్యను ఖండించిన ఒమన్

మస్కట్: స్వీడన్‌లో అతివాదులు పవిత్ర ఖురాన్ గ్రాంధాన్ని తగలబెట్టడంపై ఒమన్ ఫారిన్ మినిస్ట్రీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఈ చర్యను ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఒమన్ ఫారిన్ మినిస్ట్రీ. ముస్లింల మనోభావాల్ని దెబ్బతీసేలా స్వీడిష్ అతివాదులు ప్రవర్తించారనీ, ఇది సమాజానికి మంచిది కాదని ఆ ప్రకటనలో పేర్కొంది ఒమన్ మినిస్ట్రీ. అతివాదం, తీవ్రవాదం ఏ రూపంలో వున్నా దాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలని ఒమన్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com