స్మార్ట్ వెహికిల్ రెంటల్ సర్వీస్ ప్రారంభం
- April 20, 2022
యూఏఈ: 'ఉడ్రైవ్' సహకారంతో ఎమిరేట్ నివాసితులు, సందర్శకుల కోసం స్మార్ట్ వెహికిల్ రెంటల్ సర్వీసును ప్రారంభించినట్లు అజ్మాన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ ప్రకటించింది. ఎమిరేట్ ఆఫ్ అజ్మాన్ నివాసితులు, సందర్శకులు మానవ ప్రమేయం లేకుండా స్మార్ట్ యాప్ ద్వారా వాహనాలను అద్దెకు తీసుకోవచ్చని అథారిటీ స్పష్టం చేసింది. అజ్మాన్ నగరం అంతటా వాహనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. వెహికిల్ అద్దె మొత్తంలో ఇంధనం, పార్కింగ్ టిక్కెట్ ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రయోగాత్మక దశలో ప్రజల నుండి ఈ సర్వీసుకు మంచి ఆదరణ లభించిందని కమర్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ CEO అహ్మద్ సఖర్ అల్ మత్రౌషి తెలిపారు. అజ్మాన్ ఎమిరేట్ నివాసితులు, సందర్శకులకు అందుబాటులో ఉన్న మార్గాలలో గంటల చొప్పున వాహనాలను అద్దెకు పొందే అవకాశాన్ని కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. వాహన అద్దె వ్యవస్థ ఎమిరేట్‌లోని ప్రజా రవాణా వినియోగదారులకు ప్రత్యామ్నాయ ఎంపికగా ఉంటుందన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







