సౌదీ సిటీ కాసిమ్‌కి వచ్చే నెల నుంచి ఫ్లై దుబాయ్ విమానాలు

- April 21, 2022 , by Maagulf
సౌదీ సిటీ కాసిమ్‌కి వచ్చే నెల నుంచి ఫ్లై దుబాయ్ విమానాలు

దుబాయ్: ఫ్లై దుబాయ్, సౌదీ అరేబియాలోని కాసిమ్‌కి మే 1 నుంచి రోజువారీ విమానాల్ని పునరుద్ధరించనుంది. సౌదీ అరేబియాలో ఫ్లై దుబాయ్ విమానాలు నడుస్తున్న డెస్టినేషన్ల సంఖ్య దీంతో ఎనిమిదికి చేరనుంది. అలెలా, దమ్మామ్, జెడ్డా, మదీనా, రియాద్, తైఫ్ మరియు యాంబు నగరాలకు ఇప్పటికే విమానాలు నడుస్తున్నాయి. మే 1 నుంచి 9 వరకు ప్రిన్స్ నయెఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి విమానాలు నడుస్తాయి. నార్తరన్ రన్ వే రిఫర్బిష్మెంట్ ప్రాజెక్టు నేపథ్యంలో కాసిమ్ విమానాశ్రయానికి మే 9 నుంచి జూన్ 22 వరకు దుబాయ్ వరల్డ్ సెంట్రల్ ఎయిర్ పోర్టు నుంచి విమానాలు నడుస్తాయి. జూన్ 23 నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ నుంచి కాసిమ్‌కి విమానాలు నడుస్తాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com