సోహార్ విమానాశ్రయం అభివృద్ధికి సీఏఏ ప్రణాళికలు

- April 23, 2022 , by Maagulf
సోహార్ విమానాశ్రయం అభివృద్ధికి సీఏఏ ప్రణాళికలు

మస్కట్: సోహార్ ఎయిర్‌పోర్ట్ లో కెపాసిటీ, ఆపరేషన్ గంటల సంఖ్యను పెంచడానికి సివిల్ ఏవియేషన్ అథారిటీ ఒక వ్యూహాత్మక ప్రణాళికను అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా సివిల్ ఏవియేషన్ అథారిటీ ఛైర్మన్ ఎం. నయేఫ్ బిన్ అలీ అల్ అబ్రి సోహర్ ఎయిర్‌పోర్ట్ లో పర్యటించింది. అలాగే నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సోహార్ విలాయత్‌లో లాజిస్టికల్ కనెక్టివిటీ, ఇంటిగ్రేషన్‌పై రెండవ వర్క్ షాప్ ను రవాణా, కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిర్వహించింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ రూపొందించిన విజన్‌ లో సోహార్ విమానాశ్రయం నుండి తమ విమానాలను నడపడానికి జాతీయ విమానయాన సంస్థలను ప్రేరేపించడం, విమానాల కోసం ఎయిర్ పోర్ట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ప్రయాణికులకు మెరుగైన వసతి కల్పించడం, రాత్రి సమయాల్లో కార్యాచరణ పని గంటలను పెంచడం, సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాలు, భూ రవాణా, ఓడరేవుల మధ్య అనుసంధానం తదితర అంశాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com