రక్షణ అవసరాల కోసం రష్యాపై భారత్ ఆధారపడొద్దు: పెంటగాన్
- April 23, 2022వాషింగ్టన్: భారత్, రష్యా బంధంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. రక్షణ అవసరాల కోసం రష్యాపై ఇండియా ఆధారపడడం మానుకోవాలని అమెరికా రక్షణశాఖ పెంటగాన్ అభిప్రాయపడింది. ఇండియాతో పాటు ఇతర దేశాలు కూడా రక్షణ అవసరాల కోసం రష్యాపై ఆధారపడడం ఆపేయాలని భావిస్తున్నామని, దీంట్లో తమకు ఎటువంటి ఉద్దేశం లేదని, కానీ ఆ అంశాన్ని ప్రోత్సహించమని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ తెలిపారు.
భారత్‌తో ఉన్న రక్షణ బంధానికి తాము విలువ ఇస్తామని, అమెరికా-ఇండియా మధ్య బంధం మరింత బలోపేతం కావడానికి కృషి చేస్తామన్నారు. ఉపఖండంలో భద్రతను కల్పించేది భారత్ అని, ఆ విషయాన్ని గుర్తిస్తామని అన్నారు. 2018లో ట్రంప్ సర్కార్ నిరాకరించినా.. ఇండియా మాత్రం రష్యా నుంచి ఎస్-400 ట్రియంప్ ఎయిర్ డిఫెన్స్ మిస్సైళ్లను కొనుగులుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఎస్-400 మిస్సైళ్లు కొన్న టర్కీపై అమెరికా నిషేధం విధించింది.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..