విటమిన్ల లోపం..గుర్తించటం ఎలాగంటే?

- April 23, 2022 , by Maagulf
విటమిన్ల లోపం..గుర్తించటం ఎలాగంటే?

విటమిన్ల లోపం కొన్ని లక్షణాల ద్వారా బయట పడుతూ ఉంటుంది.. కాబట్టి ఆ లక్షణాల పట్ల అవగాహన ఏర్పరుచుకుని .. ఆ విటమిన్ పరిమాణాన్ని పెంచి డెఫీషియన్సీ ని అరికట్టాలి..

నోటి చివర్లలో: నోటి చివర్లలో పగుళ్లు ఏర్పడుతుంటే జింక్, ఐరన్, బి విటమిన్లు ( నియాసిన్, రైబో ఫ్లోవిన్ , విటమిన్ బి 12) లోపంగా భావించాలి.

చర్మం: చర్మం మీద ఎర్రని, పొట్టుతో కూడిన రషెస్ తో పాటు , వెంట్రుకలు రాలుతూ ఉంటే నీటిలో కరిగే బయోటిన్ (విటమిన్ బి7) లోపంగా గుర్తించాలి.

తిమ్మిర్లు: అరచేతులు, పాదాల్లో చురుక్కు మనటం, తిమ్మిర్లు ఉన్నా , మొద్దుబారిన బి విటమిన్ల ( ఫోలేట్, బి6, బి12) లోపమని గ్రహించాలి..

కండరాల నొప్పులు: కాలి బొటన వేళ్ళు, పిక్కలు, పాదాలు, కాళ్లలో పోట్లు ఉంటే మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం లోపం ఉందని తెలుసుకోవాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com