క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే మరణాల సంఖ్య తగ్గించవచ్చు
- April 23, 2022
హైదరాబాద్ : హైదరాబాదులో ఏఐజీ హాస్పటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పెద్దప్రేగు క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. క్యాన్సర్ వ్యాధిని ముందుగానే గుర్తిస్తే మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు.క్యాన్సర్ వ్యాధితో మరణించే వారి సంఖ్య పెరుగుతోందని, నిరంతరం వైద్య పరీక్షలు చేసుకుంటే క్యాన్సర్ లాంటి వ్యాధులను ముందే గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యకరమైన ఆహారం, తగినంత వ్యాయం చేస్తే వ్యాధులు రాకుండా వీలైనంతగా నియంత్రించవచ్చని ఎమ్మెల్సీ కవిత అభిప్రాయపడ్డారు.
కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఏడాదికి ఒక సారైనా పూర్తి స్థాయి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ సభ్యుల ఆరోగ్యంతో పాటు, తమ ఆరోగ్యం పట్ల సైతం శ్రద్ధ వహించాలన్నారు. హైదరాబాద్ ను భారతదేశ మెడికల్ హబ్ గా అభివర్ణించిన ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వం వైద్య సౌకర్యాలను మెరుగుపర్చేందుకు అనేక చర్యలు తీసుకుందన్నారు. అనేక దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగా వైద్య రంగంలో విశేష సేవలందించిన డా.నాగేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







