ఏటీఎం వద్ద పేలుళ్ళకు కుట్ర: నిందితుల అప్పీల్ తిరస్కరించిన బహ్రెయిన్ న్యాయస్థానం

- April 23, 2022 , by Maagulf
ఏటీఎం వద్ద పేలుళ్ళకు కుట్ర: నిందితుల అప్పీల్ తిరస్కరించిన బహ్రెయిన్ న్యాయస్థానం

మనామా: బహ్రెయినీ న్యాయస్థానం, ముగ్గురు వ్యక్తులకు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. నేషనల్ బ్యాంక్ ఏటీఎంల వద్ద నిందితులు పేలుళ్ళకు కుట్ర పన్నినట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఓ తీవ్రవాద సంస్థ కోసం నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. నిందితులలో ఇద్దరికి న్యాయస్థానం 15 ఏళ్ళ జైలు శిక్ష, ఓ నిందితుడికి పదేళ్ళ జైలు శిక్ష విధించడం జరిగింది. అల్ అష్తార్ బ్రిగేడ్స్ అనే తీవ్రవాద సంస్థకు అనుబంధంగా నిందితులు పని చేసినట్లు అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తూ అది విఫలయత్నంగా మిగిలింది. ఈ ఘటనలో మొత్తం 14 మందిని అరెస్ట్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com