ప్రముఖ పీడీయాట్రిషన్ డా.లక్ష్మి కాంత్ పూళ్లతో ముఖాముఖి...
- April 24, 2022
ప్ర): చిన్న సమస్య అయినా, పెద్ద సమస్య అయినా..చిన్న పిల్లల్లో గుర్తించడం కష్టం. తమ సమస్య గురించి చెప్పుకోలేని చిన్న పిల్లలు..వారు ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో గుర్తించడమెలా?
జ): చంటి పిల్లల్లో సమస్యలు గుర్తించడంలో ప్రతి తల్లి నిష్ణాతురాలు. నూటికి 80% సమస్యలు తల్లి గుర్తించగలదు. మిగిలిన 20 శాతం ఒక పీడియాట్రిషన్ (పిల్లల వైద్యులు) గుర్తించగలరు.
ప్ర):సాధారణంగా చిన్న పిల్లల్లో వచ్చే అనారోగ్య సమస్యలేంటి?
జ): పిల్లల్లో వచ్చే సాధారణ సమస్యలు ఉదా: అజీర్తి, కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు..
ప్ర):ఎలాంటి సమస్యల్ని సాధారణ సమస్యలుగా గుర్తించాలి?
జ):సమస్య చిన్నదైనా వెంటనే పీడియాట్రిషన్ ను కలవడం మంచిది.
ప్ర):తీవ్రమైన అనారోగ్య సమస్యలు చిన్న పిల్లల్లో వున్నట్లు ఎలా గుర్తించగలం?
జ):తీవ్రమైన సమస్యలు గుర్తించటానికి ముఖ్య తార్కాణం పాలు తాగడం మానేయటం,విపరీతమైన పేచీ పెట్టటం, డొక్కలు ఎగురవేస్తూ ఆయాసపడటం, మగతగా ఉండటం మొదలైన లక్షణాలు.
ప్ర):తరచూ జలుబు సంబంధిత సమస్యలతో బాధపడే చిన్నారులకు ఎలాంటి వైద్య చికిత్స అవసరమవుతుంది?
జ):తరచూ జలుబుకు కొన్ని మందులు అవసరం పడతాయి.అలాగే ముఖ్యంగా ఇంట్లో పెద్దలకి జలుబు-దగ్గు ఉన్నప్పుడు వాళ్ళు పిల్లలకి దూరంగా ఉండాలి లేదా మాస్క్ ధరించాలి.
ప్ర):కోవిడ్ ప్రభావం చిన్న పిల్లలపై ఎంత?
జ):అదృష్టవశాత్తూ అనేక కారణాల వల్ల పిల్లలు ఇప్పటివరకూ చాలా తక్కువ సంఖ్యలోనే వ్యాధి బారినపడ్డారు.వైరస్ శరీరంలోకి చేరడానికి, స్పెషల్ రిసెప్టార్లు తక్కువ వ్యక్తీకరణ అందుకు ముఖ్య కారణం.అందులోనూ తక్కువమంది పిల్లలకే తీవ్రమైన లక్షణాలు కనిపించాయి.
--డా.లక్ష్మి కాంత్ పూళ్ల(వై.ఎస్.ఆర్ హాస్పిటల్,నర్సీపట్నం,ఆంధ్రప్రదేశ్)
తాజా వార్తలు
- సీఎం కేసీఆర్తో ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ భేటీ
- ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
- దుబాయ్ స్టోర్లలో ప్లాస్టిక్ బ్యాగులపై ఛార్జీలు
- ఫిఫా మస్కట్ లాయీబ్ ‘స్టాంప్’ ఆవిష్కరణ
- మద్యానికి బానిసైన భర్త నుండి విడాకులు పొందిన మహిళ
- వాక్-ఇన్ పాస్పోర్ట్ సేవా శిబిరాలను ఏర్పాటు చేయనున్న దుబాయ్ ఇండియన్ కాన్సులేట్
- పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం
- తీవ్ర ఆర్థిక సంక్షోభంలో శ్రీలంక.. పాఠశాలలు, కార్యాలయాల మూత
- ఉద్యోగ ఒప్పంద రద్దుకు 60 రోజుల నోటీసు అవసరం: సౌదీ
- 2030నాటికి $4 బిలియన్ల వ్యవస్థగా ‘మెటావర్స్’