ప్రపంచంలోనే తొలి 'మెటా హ్యూమన్' క్యాబిన్ ఖతార్ లో ప్రారంభం

- April 24, 2022 , by Maagulf
ప్రపంచంలోనే తొలి \'మెటా హ్యూమన్\' క్యాబిన్ ఖతార్ లో ప్రారంభం

ఖతార్: ప్రపంచంలోనే మొట్టమొదటి 'మెటా హ్యూమన్' క్యాబిన్ ను ఖతార్ ఎయిర్ వేస్ ప్రారంభించింది. విమానయాన సంస్థ తన ప్రయాణికుల కోసం QVerse అనే నవల వర్చువల్ రియాలిటీ (VR)ని అందుబాటులోకి తీసుకొచ్చింది.  ఖతార్ ఎయిర్‌వేస్ వెబ్ సైట్ ను సందర్శించే ప్రయాణికులు ఈ వీఆర్ టెక్నాలజీ ద్వారా హమద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (HIA)లో ప్రీమియం చెక్-ఇన్ ప్రాంతాన్ని వర్చువల్‌గా సందర్శించవచ్చు. నావిగేట్ చేయడంతోపాటు ఎయిర్‌లైన్స్ ఎయిర్‌క్రాఫ్ట్ క్యాబిన్ ఇంటీరియర్ ను చూడవచ్చు. అలాగే అవార్డు గెలుచుకున్న బిజినెస్ క్లాస్ – Qsuite, ఎకానమీ క్లాస్ క్యాబిన్ లను స్వయంగా పరిశీలించవచ్చు. ఖతార్ జాతీయ క్యారియర్ డిజిటల్ ఇంటరాక్టివ్ కస్టమర్ అనుభవాన్ని అందించే 'మెటా హ్యూమన్' క్యాబిన్ సిబ్బందిని పరిచయం చేసిన మొదటి ప్రపంచ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్ వేస్ నిలిచింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com