భారత్ కరోనా అప్డేట్
- April 24, 2022
న్యూ ఢిల్లీ: కరోనా మహమ్మారి పీడ ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా, యూరోప్, ఆసియ ఖండాల్లోని పలు దేశాల్లో కరోనా వ్యాప్తి నాలుగో దశ కొనసాగుతుంది. వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇటు భారత్ లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. గత ఐదు రోజులుగా దేశంలో నిత్యం రెండు వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక గడిచిన 24 గంటల్లో(శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు) దేశంలో కొత్తగా 2593 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధరణ అయింది. మహమ్మారి భారినపడి 44 మంది మృతి చెందారు. 1755 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,25,19,479కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 15,873 యక్టీవ్ కేసులు ఉండగా..క్రియాశీలక శాతం 0.04కి చేరుకుంది.
రికవరీ రేటు 98.75 శాతంగా ఉంది. ఇండియాలో ఇప్పటివరకు 4,30,57,545 కరోనా కేసులు నమోదు కాగా, 5,22,193 మరణాలు సంభవించాయి. మరో వైపు కోవిడ్ – 19 నియంత్రణ కోసం దేశంలో వ్యాక్సిన్ పంపిణీ శరవేగంగా కొనసాగుతుంది. భారత్ లో గత 464 రోజులుగా కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 187.67 కోట్ల డోసుల టీకాలు పంపిణీ చేశారు. శనివారం ఒక్కరోజే 19,05,374 డోసుల టీకాలు పంపిణీ చేశారు. ఒక వేళ భారత్ లోనూ కరోనా నాలుగో దశ సంకేతాలు ఉంటే..వ్యాక్సిన్ పంపిణీ పై ఎప్పటికప్పుడు కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.
మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కరోనా తాజా పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. ఏప్రిల్ 27న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి, నాలుగో దశ ప్రభావం, వ్యాక్సినేషన్, సహా కోవిడ్ నియంత్రణ చర్యలపై మోదీ ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సైతం ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని..పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







