యూఏఈలో 9 రోజులపాటు ఈద్ సెలవులు.. పగడ్బందీగా పోలీసు పెట్రోలింగ్
- April 27, 2022
యూఏఈ: 9 రోజులపాటు ఈద్ సెలవులు ప్రకటించడంతో యూఏఈ పోలీసులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. సెలవు రోజుల్లో పెట్రోలింగ్ వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఈద్ సమయంలో రస్ అల్ ఖైమా పోలీసులు ఎమిరేట్ అంతటా 80 పెట్రోలింగ్ వాహనాలను మోహరించనున్నారు. చట్ట ఉల్లంఘనలను గుర్తించేందుకు రోడ్లపై కూడా రాడార్లు, కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయనున్నారు. పెట్రోలింగ్ వాహనాల సమీపంలోని మాల్స్, పార్కులు, మస్జీదులు, పర్యాటక ప్రాంతాల వద్ద రద్దీ ప్రాంతాలలోనూ నిఘాను పర్యవేక్షిస్తామని రస్ అల్ ఖైమా పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ అలీ అబ్దుల్లా అల్వాన్ తెలిపారు. ప్రజలు నుంచి వచ్చే 901 నంబర్‌పై సందేహాలను, 999లో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఆపరేషన్స్ గదిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!







