ఈద్ అల్-ఫితర్‌కు ముందు స్థిరంగా ధరలు: ఒమన్

- April 27, 2022 , by Maagulf
ఈద్ అల్-ఫితర్‌కు ముందు స్థిరంగా ధరలు: ఒమన్

మస్కట్: ఈద్ అల్-ఫితర్‌కు ముందు మార్కెట్లలో వ్యవసాయ ఉత్పత్తుల లభ్యతను వ్యవసాయ, మత్స్య సంపద, జలవనరుల మంత్రిత్వ శాఖ పరిశీలించింది. కూరగాయలు, పండ్ల కోసం సెంట్రల్ మార్కెట్లను మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక, దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తుల గురించి ఆరా తీశారు. కూరగాయలు, పండ్ల నాణ్యతను నిపుణులు, వినియోగదారుల రక్షణ అథారిటీలోని అధికారులు తనిఖీ చేశారు. ఈద్ అల్-ఫితర్ కంటే ముందు వినియోగదారులకు వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటు, ధరల స్థిరత్వాన్ని కొనసాగించాలని మార్కెట్ నిర్వాహకులను ఆదేశించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com