ఈద్ వేడుకలు: యూఏఈ కొత్త కోవిడ్ గైడ్‌లైన్స్

- April 28, 2022 , by Maagulf
ఈద్ వేడుకలు: యూఏఈ కొత్త కోవిడ్ గైడ్‌లైన్స్

 యూఏఈ: యూఏఈ జాతీయ ఎమర్జన్సీ క్రైసిస్ మరియు డిజాస్టర్స్ మేనేజిమెంట్ అథారిటీ, ఈద్ వేడుకల నేపథ్యంలో ప్రత్యేకంగా కోవిడ్ సూచనలు జారీ చేయడం జరిగింది. ప్రేయర్ మరియు కుత్బా కోసం 20 నిమిషాలు మించకూడదు. ఎక్కువమంది గుమికూడకుండా పోలీస్ పెట్రోల్స్ పర్యవేక్షిస్తుండడం జరుగుతుంది. వ్యక్తిగత మరియు వాడి పారేయదగిన వర్షిప్ కార్పెట్లను వినియోగించాలి.ఈద్ ప్రార్తనల కోసం డాన్ ప్రేయర్ తర్వాత మసీదుల గేట్లు తెరవబడతాయి. ప్రార్థనలకు గంట ముందు బయట వున్న స్పీకర్లను వినియోగిస్తారు. ఫేస్ మాస్కులను ప్రతి ఒక్కరూ ధరించాలి, ఫిజికల్ డిస్టెన్సింగ్ కూడా పాటించాలి. గుమి కూడటం, కరచాలనం వంటివి ప్రార్థనల తర్వాత చేయకూడదు. బంధువులు, కుటుంబ సభ్యులకు సంబంధించి సెలబ్రేషన్స్ పరిమితంగా జరగాలి. అల్ హోస్న్ యాప్ ద్వారా గ్రీన్ స్టేటస్ సర్టిఫికెట్ తప్పదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com