160 మంది ఖైదీలను విడుదల చేసిన బహ్రెయిన్ రాజు

- April 29, 2022 , by Maagulf
160 మంది ఖైదీలను విడుదల చేసిన బహ్రెయిన్ రాజు

బహ్రెయిన్: వివిధ కేసులలో దోషులుగా తేలి, జైలు శిక్షలు అనుభవిస్తున్న 160 మంది ఖైదీలను బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా క్షమించి విడుదల చేశారు. ఈ మేరకు కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఒక రాయల్ డిక్రీని జారీ చేశారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా మంచి ప్రవర్తన కలిగిన ఖైదీలను గుర్తించి విడుదల చేశారు. క్షమాపణ పొందిన ఖైదీలు సమాజంలో కొత్తగా జీవితాలను పున:ప్రారంభించాలని, సమాజ అభివృద్ధిలో పాల్గొనాలని రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ఆకాంక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com