బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు.. నిందుతుడు సాయికృష్ణకి ఉరిశిక్ష
- April 29, 2022
అమరావతి : గుంటూరు పరమయ్యకుంటకు చెందిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరులోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రమ్యను హత్య చేసిన శశికృష్ణకు కోర్టు ఉరిశిక్షను విధించింది. గత ఏడాది ఆగస్ట్ 15న నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా రమ్యను కత్తితో పొడిచి శశికృష్ణ హత్య చేశాడు. సీసీ కెమెరాలో నమోదైన దృశ్యాల ఆధారంగా 24 గంటల్లోనే శశికృష్ణను పోలీసులు పట్టుకున్నారు. నరసరావుపేట సమీపంలో అదుపులోకి తీసుకున్నారు.
డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో 36 మందిని విచారించిన పోలీసులు 15 రోజుల వ్యవధిలోనే ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. సీసీ కెమెరాల ఫుటేజీని కూడా చూసిన న్యాయమూర్తి ఈనెల 26న విచారణ పూర్తి చేశారు. తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి కాసేపటి క్రితం తీర్పును వెలువరించారు. శశికృష్ణకు ఉరిశిక్ష విధిస్తూ జడ్జిమెంట్ ఇచ్చారు.
ఈ క్రమంలో రమ్య కుటుంబ సభ్యులు కోర్టు తీర్పును స్వాగతించారు. నిందితుడికి సరైన శిక్ష పడిందన్నారు. తమ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరేలా కోర్టు తీర్పు ఉందని రమ్య తల్లిదండ్రులు చెప్పారు.
కాగా, గుంటూరు జిల్లాలోని పరమయ్యకుంటకు చెందిన రమ్యను శశికృష్ణ ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేశాడు. శశికృష్ణ వేధింపులను భరించలేక అతన్ని ఫోన్ నంబర్‌ను రమ్య బ్లాక్ చేసింది. దీంతో మరింత రెచ్చిపోయిన శశికృష్ణ ఆమెపై పట్టపగలే కత్తితో దాడి చేశాడు. రమ్య శరీరంపై 8 కత్తిపోట్లను వైద్యులు గుర్తించారు. క్షణికావేశానికి లోనైన శశికృష్ణ రమ్యను బలితీసుకోవడం అప్పట్లో ఏపీలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు







