పోలీసుల యూనిఫామ్‌కి కెమెరాల ఏర్పాటు ప్రతిపాదన

- April 29, 2022 , by Maagulf
పోలీసుల యూనిఫామ్‌కి కెమెరాల ఏర్పాటు ప్రతిపాదన

కువైట్: ఇంటీరియర్ మరియు డిఫెన్స్ కమిటీ-నేషనల్ అసెంబ్లీ, పోలీసుల యూనిఫామ్‌కి కెమెరాలను ఏర్పాటు చేసే ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది.కేవలం విధి నిర్వహణ సమయాల్లో మాత్రమే ఈ కెమెరాలు పని చేస్తాయి. చట్టాన్ని అమలు చేసే పోలీస్ విభాగానికి సంబంధించిన అన్ని యూనిట్లూ, పౌరుల భద్రతకు కట్టుబడి వుండడం, ఉల్లంఘనల్ని గుర్తించడం, నోటీసులు జారీ చేయడం వంటివాటికి సంబంధించి కీలక చర్యలు తీసుకుంటారు. కొన్ని సార్లు ఈ విషయమై ఇబ్బందులు తలెత్తుతుంటాయి పౌరులు లేదా నివాసితుల నుంచి. ఈ క్రమంలో పూర్తి ఆధారాల కోసం బాడీ వోర్న్ కెమెరాల ఏర్పాటు దిశగా చర్యలు చేపడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com