ప్రజలకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన షేక్ మహమ్మద్
- May 01, 2022
యూఏఈ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ప్రతి సంవత్సరం ఎమిరేట్స్, అరబ్, ఇస్లామిక్ దేశాల ప్రజలు ఒకరికొకరు దగ్గరవుతున్నారని తన సందేశంలో పేర్కొన్నారు. మన హృదయాలు మరింత ప్రేమగా, సహనంతో, శాంతియుతంగా ఉంటాయన్నారు. అలాగే యూఏఈ, అరబ్, అన్ని ఇస్లామిక్ దేశాల నాయకులకు క్రౌన్ ప్రిన్స్ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ అల్-ఫితర్ సందర్భంగా ఎమిరేట్స్, అరబ్, ఇస్లామిక్ దేశాల నాయకత్వం, ప్రజలను అభినందిస్తున్నట్లు తెలిపారు. శనివారం రాత్రి షవ్వాల్ చంద్రుడు కనిపించకపోవడంతో యూఏఈలో మే 2న ఈద్ అల్ ఫితర్ జరుపుకోనున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







