టాలివుడ్ హీరోలు ప్రేక్షకులకు పసందైన వినోదంతో ..

- April 05, 2016 , by Maagulf
టాలివుడ్ హీరోలు ప్రేక్షకులకు పసందైన వినోదంతో ..

ఉగాది అంటే మనందరికి ముందుగా గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఈ పచ్చడి షడ్రుచుల సమ్మేళనంతో అందరిని ఊరిస్తూ ఉంటుంది. ఇదే ఉగాదికి టాలీవుడ్ హీరోలు కూడా తమ సినిమాలకు సంబంధించిన టీజర్స్, ట్రైలర్స్, ఫస్ట్ లుక్స్‌తో ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్‌ను ఈ ఉగాదికి అంటే ఏప్రిల్ 8న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఈ మూవీ ఉగాదికి గ్రాండ్ ట్రీట్ ఇస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న బ్రహ్మోత్సవం చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, పోస్టర్స్ మరియు న్యూ టీజర్‌ని ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు.అలాగే నందమూరి నటసింహం బాలయ్య వందో సినిమా లాంచింగ్ కార్యక్రమం కూడా ఈ ఉగాది రోజే జరగనున్నట్టు సమాచారం.స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సరైనోడు చిత్రానికి సంబంధించిన థీయేట్రికల్ ట్రైలర్‌ని ఈ ఉగాదికి విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్ , మారుతి కాంబినేషన్‌లో రూపొందుతున్న బాబు బంగారం సినిమా ఫస్ట్ లుక్ కూడా ఈ ఉగాది రోజే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే అక్కినేని అఖిల్ రెండో చిత్రంకు సంబంధించిన వివరాలను నాగ్ ఉగాది రోజే అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ ఉగాది నాడు టాలివుడ్ హీరోలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించేందుకు సిద్దమవుతుండగా, అభిమానులు ఈ పండుగను ఫుల్‌గా ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com