ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించిన బహ్రెయిన్ రాజు

- May 02, 2022 , by Maagulf
ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించిన బహ్రెయిన్ రాజు

మనామా: బహ్రెయిన్ రాజు హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, ఈద్ ప్రార్థనల్ని అల్ సఖిర్ ప్యాలెస్ మసీదులో నిర్వహించారు. రాయల్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమాద్ అల్ ఖలీఫా (క్రౌన్ ప్రిన్స్, ప్రైమ్ మినిస్టర్), రాజ కుమారులు, రాయల్ కుటుంబ సీనియర్ సభ్యులు కూడా ప్రార్థనల్ని నిర్వహించారు. డాక్టర్ షేక్ మొహమ్మద్ అల్ బు జందాల్, బహ్రెయిన్ రాజు హమాద్‌ ఆయురారోగ్యాలతో వుండాలనీ, బహ్రెయిన్ మరింత అభివృద్ధి పథంలో పయనించాలని దేవుడ్ని ప్రార్థించారు, ఈద్ సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ రాజు, దేశ ప్రజలకీ, ప్రపంచ వ్యాప్తంగా వున్న ముస్లిం సమాజానికి ఈద్ శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com