త్వరలోనే ఎజార్ హౌసింగ్ కాంట్రాక్ట్ కొత్త వెర్షన్
- May 04, 2022
రియాద్: ఎజార్ హౌసింగ్ కాంట్రాక్ట్ కొత్త వెర్షన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నారు. దీని ద్వారా ప్రభుత్వ ఏజెన్సీలకు హక్కులు, అద్దెదారు అధికారం, హౌసింగ్ యూనిట్ భాగాలను అద్దెకు తీసుకునే అవకాశం, నిబంధనలకు బాధ్యత వహించే పార్టీలను నిర్ణయించే అవకాశం కల్పిస్తుంది. "ఎజార్" అనేది ఒక సమగ్ర వ్యవస్థ. ఇది సౌదీ అరేబియాలో హౌసింగ్, రియల్ ఎస్టేట్ రంగాన్ని అభివృద్ధి చేయడం, లీజుకు సంబంధించిన అన్ని పార్టీల హక్కులను కాపాడే పరిష్కారాలతో తయారు చేశారు. రెంటల్ సర్వీసెస్ ఇ-నెట్‌వర్క్ "ఎజార్" అనేది అద్దె ప్రక్రియలో కీలక భూమిక పోషించనుంది. పార్టీల (అద్దెదారు, భూస్వామి, రియల్ ఎస్టేట్ బ్రోకర్) మధ్య సంబంధాన్ని నియంత్రించే లక్ష్యంతో బలమైన నిబంధనలను పొందుపరిచారు. ఇంటిగ్రేటెడ్ ఇ-సేవలతోపాటు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను నియంత్రించడం, అద్దెదారుల హక్కులను సంరక్షించడం, పర్యావరణం సమతుల్యతను సాధించే లక్ష్యంతో ఎజార్ హౌసింగ్ కాంట్రాక్ట్ కొత్త వెర్షన్ ను రూపొందించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్‌వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







