పదోతరగతి అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు
- May 04, 2022
భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్ విభాగం దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38926 ఖాళీలలను భర్తీ చేయనున్నారు భర్తీ చేయనున్న పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలను పరిశీలిస్తే తెలంగాణలో 1226 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్లో 1716 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలకు సంబంధించి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(ABPM),డాక్ సేవక్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు. ఏబీపీఎం,డాక్సేవక్ పోస్టులకు నాలుగు గంటల టీఆర్సీఏ సబ్ ప్లాన్ కింద నెలకు రూ.10000 వేతనంగా చెల్లిస్తారు.
ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మెరిట్ లిస్ట్ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్లైన్ పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 2,2022 నుండి ప్రారంభమౌతుంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 5,2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: https://indiapostgdsonline.gov.inపరిశీలించగరలు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







