మళ్లీ కరోనా ఉద్ధృతి ..
- May 05, 2022
జెరూసలేం: ఈ ప్రపంచం పై విరుచుకుపడేందుకు కరోనా వైరస్ మళ్లీ పొంచి చూస్తోందని ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉపరకాలు వచ్చే రెండుమూడు నెలల్లో వాటంతట అవే కనుమరుగవుతాయని శుభవార్త చెప్పిన శాస్త్రవేత్తలు డెల్టా, లేదంటే మరో కొత్త వేరియంట్ మాత్రం వెలుగు చూసి ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉందని బెన్ గురియన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. బీర్ షెవా నగరంలోని మురుగునీటిని సేకరించి పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు.. ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ల మధ్య పరస్పరం చర్య జరుగుతున్నట్టు గుర్తించారు.
డెల్టా వేరియంట్ రాకతో అంతకుముందున్న వైరస్ రకాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. అయితే, డెల్టా తర్వాత వచ్చిన ఒమిక్రాన్ మాత్రం డెల్టా వేరియంట్‌పై ప్రభావం చూపించలేకపోయింది. ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఒమిక్రాన్, దాని సబ్ వేరియంట్లు మరో రెండు మూడు నెలల్లో వాటంతట అవే తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని, డెల్టా మాత్రం రహస్యంగా దాని పని అది చేసుకుపోతున్నట్టు వివరించారు.
అంతేకాదు, అది మరింత శక్తిమంతంగా మారే అవకాశం కూడా ఉందన్నారు. లేదూ అంటే మరో కొత్త వేరియంట్ పుట్టుకకు అది దారితీసే అవకాశం కూడా ఉందని అన్నారు. నిజానికి డామినెంట్ వేరియంట్లు ఎప్పుడూ వాటికంటే అధికశక్తి కలిగి ఉంటాయన్నారు. ఈ లెక్కన చూసుకుంటే డెల్టా లేదంటే మరో కొత్త వేరియంట్ కారణంగా కొవిడ్ మళ్లీ చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్నట్టు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ఏరియెల్ కుష్మారో తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







