డ్రైవింగ్: ఆల్కహాల్ కన్నా మొబైల్ ఫోన్ ప్రమాదకరం
- April 05, 2016
డ్రైవింగ్ సమయంలో ఆల్కహాల్ కన్నా మొబైల్ ఫోన్ ప్రమాదకరమని వివిధ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. రాయల్ ఒమన్ పోలీసులు ఈ అంశాన్ని ధృవీకరించారు. ఆల్కహాల్ సేవించి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నవారికన్నా డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడకం దారులే ఎక్కువ ప్రమాదాలకు కారణమవుతున్నారని రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం మొబైల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడిపేవారికి 35 ఒమన్ రియాల్స్ ఫైన్ విధిస్తున్నారు. దీన్ని 300 ఒమన్ రియాల్స్కి పెంచడంతోపాటు నెల రోజుల నుంచి 2 ఏళ్ళ జైలు శిక్ష విధించేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి వాహనాన్నీ తనిఖీలు చేయడం కుదరదనీ, ప్రమాదాల నివారణకు చైతన్యం పెంచడమే మార్గమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని రాయల్ ఒమన్ పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- నమ్మకం, అభివృద్ధి ద్వారానే శాశ్వత శాంతి..!!
- దుబాయ్లో తగ్గిన నేరాల రేటు..ఎకానమీ హైక్..!!
- గ్లోబల్ పాస్పోర్ట్ పవర్ ర్యాంక్ 2025: యూఏఈ టాప్..ఖతార్ స్ట్రాంగ్..!!
- కువైట్ లో అత్యధికంగా 24.3 మి.మీ వర్షపాతం..!!
- ధురంధర్ కు గల్ఫ్ దేశాలలో అనుమతి నిరాకరణ..!!
- వింటర్ మాటున దాగిఉన్న ప్రమాదం..హెచ్చరికలు జారీ..!!
- IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ?
- మెస్సీ టూర్.. కుర్చీలు, బాటిళ్లు విసిరేసి అభిమానులు రచ్చరచ్చ..
- డిసెంబర్ 31నే జనవరి పెన్షన్ పంపిణి
- రుణ గ్రహీతలకు SBI భారీ శుభవార్త..







