వరంగల్ చేరుకున్న రాహుల్ గాంధీ..
- May 06, 2022
వరంగల్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ చేరుకున్నారు. ముందుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఘనస్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వరంగల్ బయల్దేరారు. మొదట వరంగల్ గాబ్రియల్‌కు స్కూల్ గ్రౌండ్‌కు రాహుల్ చేరుకున్నారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్‌జీపులో ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లోని సభా ప్రాంగణానికి ర్యాలీగా రాహుల్ బయల్దేరారు. రాహుల్ తో పాటు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఉన్నారు.
ఈ రోజు (శుక్రవారం) సాయంత్రం 7 గంటలకు వరంగల్ లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్భంగా రాహుల్ రైతు సంఘర్షణ సభలో రైతులనుద్దేశించి ప్రసంగించనున్నారు. వరంగల్‌లో సభ ముగిసిన అనంతరం రాహుల్ రోడ్డు మార్గాన హైదరాబాద్ పయనం కానున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







