విదేశాల్లో పాస్‌పోర్ట్ పోతే.. గుర్తింపు కార్డుగా ‘ఐడీపీ’:యూఏఈ
- May 07, 2022
యూఏఈ: విదేశాల్లో పాస్‌పోర్ట్ పోగొట్టుకున్న సందర్భంలో యూఏఈ జారీ చేసిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (ఐడీపీ)ని గుర్తింపు కార్డుగా ఉపయోగించవచ్చని యూఏఈ డిజిటల్ ప్రభుత్వం తెలిపింది. అయితే యూఏఈ పౌరులు, నివాసితులు అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ లేకుండా విదేశాలలో వాహనం నడపడం అనుమతించబడదని యూఏఈ డిజిటల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజిటల్ ప్రభుత్వం ప్రకారం..యూఏఈలో ఐడీపీని పొందేందుకు ఐదు పత్రాలు అవసరం. అవి ఎమిరేట్స్ ఐడీ, పాస్పోర్ట్, చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ వీసా, యూఏఈ జారీ చేసిన చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కాపీ, రెండు వ్యక్తిగత ఫోటోలు అవసరం. ఐడీపీ ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుందని, తిరిగి పునరుద్ధరించవచ్చని అధికారులు తెలిపారు. ఎమిరేట్స్ ఆటోమొబైల్, టూరిజం క్లబ్ పోర్టల్ ద్వారా ఉచిత డెలివరీతో లేదా అబుదాబి, దుబాయ్, అల్ ఐన్, షార్జా, రస్ అల్ ఖైమా, అజ్మాన్, ఫుజైరా, ఉమ్ అల్ క్వైన్, వెస్ట్రన్ రీజియన్‌లోని క్లబ్ బ్రాంచ్‌ల ద్వారా ఎలక్ట్రానిక్‌గా ఐట్యూన్స్, గూగుల్ ప్లే లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ యాప్ (MOI UAE), దుబాయ్‌లోని రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) కార్యాలయాల నుండి, ఎమిరేట్స్ పోస్టాఫీసుల నుండి లేదా షేక్ జాయెద్ రోడ్‌లోని డీనాటా కార్యాలయం నుండి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ (ఐడీపీ)పి పొందవచ్చు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







