నకిలీ హజ్ వెబ్సైట్లతో జాగ్రత్త...యాత్రికులకు సౌదీ హెచ్చరిక
- May 07, 2022
సౌదీ: హజ్ చేయాలనుకునే వ్యక్తుల హజ్ రిజిస్ట్రేషన్కు సహాయం చేస్తామని ప్రకటనలిచ్చే అనుమానాస్పద వెబ్సైట్లతో జాగ్రత్తగా ఉండాలని హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ యాత్రికులను హెచ్చరించింది. 2022 సీజన్కు సంబంధించిన హజ్ విధివిధానాలను త్వరలో అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రకటిస్తామని మంత్రిత్వ శాఖ తెలిపింది. హజ్ మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరం హజ్ కోసం విదేశీ యాత్రికుల కోసం కొన్ని నిబంధనలు, షరతులను విధించనుంది. 65 ఏళ్లు పైబడిన వారిని యాత్ర చేయడానికి అనుమతించకపోవడం, యాత్రికులందరికీ రెండు డోసుల కరోనావైరస్ వ్యాక్సిన్లను తప్పనిసరి చేయడం వంటివి ఇందులో ఉన్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







