‘స్కాలర్‌షిప్’ రీఫండ్ చేయాలని మహిళను ఆదేశించిన కోర్టు

- May 07, 2022 , by Maagulf
‘స్కాలర్‌షిప్’ రీఫండ్ చేయాలని మహిళను ఆదేశించిన కోర్టు

బహ్రెయిన్: ‘స్కాలర్‌షిప్’ మొత్తాన్ని రీఫండ్ చేయాలని ఓ మహిళను బహ్రెయిన్ కోర్టు ఆదేశించింది. యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ నుండి యూరప్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం స్కాలర్‌షిప్‌గా పొందిన BD60,000 తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించడాన్ని సవాలు చేస్తూ బహ్రెయిన్ మహిళ దాఖలు చేసిన అప్పీల్‌ను హై అప్పీల్స్ కోర్టు తాజా తిరస్కరించింది. ముందుగా చేసుకన్న ఒప్పందం ప్రకారం.. స్కాలర్‌షిప్ మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి తన చదువు పూర్తి అయిన తర్వాత విశ్వవిద్యాలయంలో పని చేయడానికి సదరు మహిళ నిరాకరించింది. దీంతో స్కాలర్ షిప్ మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోరుతూ యూనివర్సిటీ ఆఫ్ బహ్రెయిన్ కోర్టును ఆశ్రయించింది. యూనివర్సిటీలో ఉద్యోగం చేసేందుకు తనకు ఆరోగ్య సమస్యలు అడ్డుపడుతున్నాయని మహిళ న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే, స్కాలర్‌షిప్ గడువు ముగిసిన రెండేళ్ల తర్వాత ఆమె తన అనారోగ్యాన్ని సాకుగా చూపుతూ నకిలీ మెడికల్ సర్టిఫికేట్లను సమర్పించిందని విశ్వవిద్యాలయం రుజువు చేయడంతో కోర్టు ఆమె వాదనను తిరస్కరించింది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com