ముంబై వడ పావ్
- May 07, 2022
ముంబై వడ పావ్
కావలసిన పదార్థాలు : 1 ఇంచ్ అల్లం, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చి మిర్చి, 1 టేబుల్స్పూన్ ఆయిల్,3/4 టీస్పూన్ ఆవాలు,1/4 టీస్పూన్ ఇంగువ, 12-15 కరివేపాకు, 4 మీడియం పొటాటోస్(ఉడకపెట్టి, తొక్కు తీసి, మాష్ చేసినవి),1/4 టీస్పూన్ పసుపు, ఉప్పు తగినంత, 2 టేబుల్స్పూన్స్ కొత్తిమీర.
1 కప్ సెనగపిండి, 1/4 టీస్పూన్ పసుపు,1/2 టీస్పూన్ సాల్ట్ , 1 పించ్ బేకింగ్ సోడా, డీప్ ఫ్రై చెయ్యటానికి పిండి కలపటానికి తగినంత నీరు.స్పైసీ చట్నీ కి కావలసినవి 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ కారం.
ముంబై పావ్ బన్స్ -6
చెయ్యవలసిన విధానం: ముందర అల్లం, వెల్లుల్లి, పచ్చి మిర్చి గ్రైండ్ చేసి పెట్టు కోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆవాలు వేసి చిటపట లాడాక, పసుపు, ఇంగువ, కరివేపాకు వేసి అర నిమిషం వేగాక , గ్రైండ్ చేసిన ముద్ద వేసి, ఇంకో అర నిమిషం వేగాక, ఉడికించిన
బంగాళాదుంప, రుచికి సరిపడా ఉప్పు వేసి, బాగా కలియపెట్టి, 2 నిమిషాలు అయ్యాక కొత్తి మీర వేసి స్టవ్ ఆపి . చల్లార నివ్వాలి.
సెనగపిండి,పసుపు,సాల్ట్ , చిటికెడు సోడా తగినంత నీరు పోసి పిండి బోండా వేసే కన్సిస్టెన్సీ లో కలుపుకొని , ఒక పావు గంట మూత పెట్టి ఉంచాలి.
స్టవ్ మీద బాణాలి లో డీప్ ఫ్రై కి సరి పడా ఆయిల్ పోసుకుని, కాగాక, అయిదు వేళ్ళు పిండిలో ఉంచి నూనె లోకి జార విడచాలి. అప్పుడు అది బూందీ లాగ, కొంచెం పొడుగు పొడుగు గా vegaaka తీసి పక్కన పెట్టాలి. రెండు వాయలు ఇలా చేస్తే చాలు. ఇవి చల్లారాక వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు వేసి, గ్రైండర్ లో పొడి చేసి పెట్టుకోవాలి.
తయారు చేసి పెట్టుకున్న బంగాళాదుంప కూర ని చిన్న ఉండలు గా చేసి, పిండి లో ముంచి బోండాలు లాగ చేసి వేయించాలి.ఇప్పుడు పావ్ బన్స్ ని మధ్యలో స్ప్లిట్ చేసి,ఒక స్పూన్ స్పైసి చట్నీ వేసి, బటాటా వడ పెట్టి తింటే ..రుచి అదుర్స్..
వి.జానకి జ్యోతి, సింగపూర్.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







