దోహా లో ఘనంగా 'ఈద్ ఉల్ ఫితర్' వేడుకలు

- May 09, 2022 , by Maagulf
దోహా లో ఘనంగా \'ఈద్ ఉల్ ఫితర్\' వేడుకలు

దోహా: ఆంధ్ర కళా వేదిక - ఖతార్ మేనేజింగ్ కమిటీ "ఈద్-ఉల్-ఫితర్" సందర్భంగా 03 మే 2022న లయోలా ఇంటర్నేషనల్ స్కూల్‌లో తెలుగు కమ్యూనిటీ కోసం "తగ్గేదే లే" అనే మెగా ఈవెంట్‌ను నిర్వహించింది.

తెలుగు నేపథ్య గాయకులు స్వరాగ్ కీర్తన్ మరియు సోనీ కొమాండూరి తమ పాటలతో, మాటలతో ప్రేక్షకులను ఆద్యంతం ఓలలాడించి ఉర్రూతలూగించారు.వీరిరువురు మాట్లాడుతూ ప్రేక్షకులు కూడా తమ అద్భుత స్పందనతో మమ్మల్ని అబ్బుర పరిచారు అని తెలిపారు.     
వినోద్ నాయర్-A/ ప్రెసిడెంట్, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF), సుబ్రమణ్య హెబ్బగులు-వైస్ ప్రెసిడెంట్, ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC), భారత రాయబార కార్యాలయం యొక్క అపెక్స్ బాడీలు నుండి వేడుకలలో పాల్గొని, ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో సంతోష్ కుమార్ పిళ్లై, ప్రముఖ తెలుగు సంఘాల అధ్యక్షులు మరియు వారి కార్యవర్గ బృందం సభ్యులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆనందించి వారి అభినందనలు తెలియజేసారు.

ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఖతార్ లోని తెలుగు వారి నుండి అద్భుతమైన స్పందన వచ్చిందని,ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ బృందం ఎన్నో అవాంతరాలను అధిగమించి చేసిన కృషి అభినందనీయమని తెలిపారు.  కార్యక్రమానికి సుమారు 450 మందికి పైగా హాజరయ్యారని, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా ప్రేక్షకులు కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించారు అని తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ విజయవంతంగా నిర్వహించుకోటానికి సహకరించిన ప్రాయోజితులు(స్పాన్సర్స్)కి ప్రత్యేకించి శుభోదయం సంస్థల అధినేత లయన్ డా.లక్ష్మి ప్రసాద్ కలపటపు కి తన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఇంకా ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన శ్రీనివాస్ గద్దె, శంకర్ గౌడ్,శాంతయ్య మరియు జి.వెంకటరమణలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి మరియు పాల్గొన్నవారికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రేక్షకుల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు మరియు రుచికరమైన విందు భోజనం కూడా ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.ఈ కార్యక్రమాన్ని సమర్ధవంతంగా నిర్వహించిన కార్యవర్గ సభ్యులు విక్రమ్ సుఖవాసి,కె.టి రావు,సుధ, శిరీషా రామ్ (హోస్ట్),ఎస్.ఎస్ రావు,సాయి రమేష్, సోమరాజు మరియు రవీంద్ర  ముగింపు సందేశంతో కార్యక్రమం ముగించారు.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com