మొదటి ఒమానీ పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించిన విద్యార్థులు
- May 09, 2022
ఒమన్: పెట్టుబడికి తగిన వాతావరణాన్ని సృష్టించడానికి, పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేయడానికి ఒమానీ విద్యార్థులు మొదటి ఒమానీ పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించారు. సోహార్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ సైన్సెస్‌కు చెందిన ఒక విద్యార్థి ‘సెమ్సార్’ పేరుతో మొదటి ఒమానీ పెట్టుబడి ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించారు. దీన్ని ఇటీవల జరిగిన ఇంజాజ్ ఒమన్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించడం ద్వారా కంపెనీ పని చేస్తుందని రూపకర్తలు వివరించారు. పెట్టుబడికి తగిన వాతావరణాన్ని సృష్టించడం, పెట్టుబడి ప్రక్రియను సులభతరం చేయడం, వ్యవస్థాపకులు-పెట్టుబడిదారులను ఒకే చోట సులభంగా, సాఫీగా అనుసంధానించే లక్ష్యంతో దీనిని రూపొందించినట్లు విద్యార్థులు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







