నిండు పౌర్ణమి

- May 09, 2022 , by Maagulf
నిండు పౌర్ణమి

ప్రాణం పోసిన దేవత మరో అపురూపమైన ప్రాణిని 

    మోసే అమృతకలశం 

నిండైన పౌర్ణమి మాధుర్యము పంచే అమృతమూర్తి 

మనసు నిండా అమృతము సేదతీరువేళ ఒడిస్వర్గము 

అన్నింటా నీవే మా వెంట తోడు నీడ నీవే అమృతవల్లి 

అలుపెరగని జీవి ఏ ఫలం ఆశించని నిత్యశ్రామికురాలు 

ఆవేదనల భారాన్ని మోస్తు  మోములో కొండంత 

  భరోసా చిరునవ్వుతో ధైర్యాన్ని నింపే సేవామూర్తి 

నిరంతరము పిల్లల ఉన్నతికై తపించే జననీ 

నిన్ను నిన్నుగా ప్రేమించి అక్కున చేర్చుకొనే తొలి ఒడి 

అమ్మ అనే అక్షరము నేర్పిన తొలి బడి 

కల్మషంలేని ఏ ఫలం ఆశించని గుడి మాతృహృదయము 

నేడు మరో బిడ్డకి తల్లిగా మలిచిన ఆ తల్లి ఋణం 

ఏమిచ్చినా  తీర్చుకోలేని ఓ అధ్భుత కావ్యం అమ్మ. 

మాతృమూర్తులకి అందరికి శుభాకాంక్షలు....


--యామిని కోళ్లూరు,అబుదాభి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com