కోర్టు జోక్యంతో 3,800 మంది కార్మికులకు బకాయిల చెల్లింపు

- May 09, 2022 , by Maagulf
కోర్టు జోక్యంతో 3,800 మంది కార్మికులకు బకాయిల చెల్లింపు

యూఏఈ: అబుదాబీలో మొత్తం 3,806 మంది కార్మికులు మొత్తంగా సుమారు 106 మిలియన్ దిర్హాముల అన్ పెయిడ్ వేతనాలు పొందగలిగారు. కోర్టు జోక్యంతో ఇది సాధ్యమయ్యింది. గడచిన మూడు నెలల్లో న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చెల్లింపులు జరిగాయి. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 1932 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 98 శాతం కేసుల్లో చర్యలు చేపట్టబడ్డాయి. ఎలక్ట్రానిక్ అభ్యర్థనలు 24,687 పరిష్కరించబడ్డాయి. అత్యంత ఖచ్చితత్వంతో, మానవీయ కోణంలో ఆయా కేసుల పరిష్కరింపబడుతున్నట్లు అబుదాబీ జ్యుడీషియల్ డిపార్టుమెంట్ అండర్ సెక్రెటరీ యూసుఫ్ సయీద్ అల్ అబ్రి చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com