అప్పుడే కాజల్ దానికి రెడీ అయిపోయిందా.?
- May 10, 2022
చందమామ కాజల్ అగర్వాల్ ఈ మధ్యనే ఓ అందమైన బుల్లి చందమామకి జన్మనిచ్చింది. బాబుకు జన్మనివ్వడం వల్ల కాజల్ అగర్వాల్ ఫిగర్లో కొద్దిపాటి మార్పులు రావడం సహజమే. అయితే, ఆ మార్పుల్ని అత్యంత తొందరగా అధిగమించేసింది కాజల్ అగర్వాల్.
మునుపటి ఛార్మింగ్ని దక్కించుకుంది. నిజంగా ఇది షాకింగ్ విషయమే. లేటెస్టుగా కాజల్ అగర్వాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తుంటే, అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రెగ్నెన్సీ కారణంగా గత కొన్ని నెలలుగా కాజల్ అగర్వాల్ సినిమాలకు దూరంగా వున్న సంగతి తెలిసిందే.
ఇక, ఇప్పుడు కాజల్ అగర్వాల్ అందం, మేకోవర్ చూస్తుంటే, బ్యాక్ టు పెవిలియన్ అన్నట్లుగా మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టిందనిపిస్తోంది. ఇప్పటికే కాజల్ చేతిలో పూర్తి చేయాల్సిన కొన్ని ప్రాజెక్టులున్నాయ్. తెలుగులో రెండు సినిమాలు చేయాలి కాజల్ అగర్వాల్.
అందులో ఒకటి కాజల్ చేయి జారిపోయింది. మిగిలిన ప్రాజెక్టును ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే, తమిళంలోనూ ఓ ప్రాజెక్టు కాజల్ చేయి దాటిపోయింది. మళ్లీ కొత్త ప్రాజెక్టులు సొంతం చేసుకోవాలి. హిందీలో ఓ వెబ్ సిరీస్‌కి కాజల్ ఓకే చేసింది. అది వర్కవుట్ చేసుకోవాలి.
ఇవన్నీ ఇన్ టైమ్‌లో కాజల్ వర్కవుట్ చేయాలంటే, తప్పదు ఫిగర్ మెయింటైన్ చేయాల్సిందే. అందుకేనేమో, ఈ మేకోవర్.. చందమామ అంటే ఇదిగో ఇలాగే వుంటుంది. మునుపటి అందం నాలో ఏమాత్రం తగ్గిపోలేదంతే.. అన్నట్లుగా సంకేతాలు ఇస్తున్నట్లున్నాయ్ కాజల్ అగర్వాల్ తాజా పిక్స్.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







