3 నెలల్లో 375 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు

- April 06, 2016 , by Maagulf
3 నెలల్లో 375 ట్రాఫిక్‌ ఉల్లంఘనలు



రస్‌ అల్‌ ఖైమా పోలీసులు 375 టిక్కెట్లను ట్రాఫిక్‌ ఉల్లంఘించిన డ్రైవర్లకు జారీ చేశారు. ట్రాఫిక్‌ నిబంధనల్ని ఖచ్చితంగా పాటించేలా ఈ కార్యక్రమం చేపట్టామని రస్‌ అల్‌ ఖైమా పోలీస్‌ కమాండర్‌ ఇన్‌ ఛీఫ్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్లా బిన్‌ అల్వాన్‌ అల్‌ నువామి చెప్పారు. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ప్రచార కార్యక్రమం ఏప్రిల్‌ నెలాఖరుకు ముగుస్తుందని ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డైరెక్టర్‌ కల్నల్‌ అలీ సయీద్‌ అల్‌ అల్కీమ్‌ వివరించారు. మార్‌చలో 189 నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జరీమానాలు విధించామని, ఫిబ్రవరిలో 136, అలాగే జనవరిలో 50 జరీమానాలు విధించామని ఆయన అన్నారు. సామాన్యులు కూడా ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై పోలీసులకు సమాచారం అందించాలని కల్నల్‌ అల్కీమ్‌ విజ్ఞప్తి చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com