తండ్రితో వాదోపవాదం: భవనం పైనుంచి పడి బాలుడి మృతి

- May 11, 2022 , by Maagulf
తండ్రితో వాదోపవాదం: భవనం పైనుంచి పడి బాలుడి మృతి

షార్జా: అల్ తవౌమ్ ప్రాంతంలో 15 ఏళ్ళ బాలుడు భవనం పైనుంచి పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి విచారణ చేపట్టారు షార్జా పోలీసులు. వివరాల్లోకి వెళితే, ఆదివారం ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం అందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు అక్కడ బాలుడి మృతదేహం కనిపించింది. ఆ బాలుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. తండ్రితో ఘర్షణ పడి, తన జీవితాన్ని అంతం చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే బాలుడు భవనం పైనుంచి దూకినట్లు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com