నిరుద్యోగులకు ఇన్స్యూరెన్స్ పథకం: ఎమిరాతీలకు, వలసదారులకు వర్తిస్తుందా?
- May 12, 2022
యూఏఈ: ఉద్యోగాలు కోల్పోయే సమస్య నుంచి నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా కొత్త నిరుద్యోగ ఇన్స్యూరెన్స్ స్కీమ్‌ని అందుబాటులోకి తీసుకురానున్నారు. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరైటైజేషన్ అబ్దుల్ రహ్మాన్ అల్ అవార్ మాట్లాడుతూ, ప్రత్యేక కారణాల వల్ల ఉద్యోగం కోల్పోయేవారికి కొంత కాలం పాటు ఆర్థిక సాయం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 2023 నుంచి ఈ తప్పనిసరి స్కీమ్ అందుబాటులోకి వస్తుంది. పబ్లిక్ మరియు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే ఉద్యోగులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. లేబర్ మార్కెట్ స్థిరత్వం కోసం ఈ ఆలోచన చేశారు.ఇన్వెస్టర్లు, డొమెస్టిక్ వర్కర్లు, తాత్కాలిక ఒప్పందాలపై పని చేసేవారు, 18 ఏళ్ళ లోపు జువైనల్స్ అలాగే రిటైర్ అయినవారికి ఈ స్కీమ్ వర్తించదు. ఇన్స్యూరెన్స్ కంపెనీల ద్వారా వివిధ ప్యాకేజీలకు ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా ఉద్యోగం పోతే, వారికి ఇన్స్యూరెన్స్ ద్వారా ఆర్థిక సాయం అందుతుంది. తమ బేసిక్ సేలరీలో 60 శాతం ఇన్స్యూరెన్స్ ద్వారా వస్తుంది. అత్యధికంగా 20,000 దిర్హాముల వరకు పరిమిత కాలానికి ఈ సాయం అందుతుంది. తప్పనిసరి ఇన్స్యూరెన్స్ 40 దిర్హాముల నుంచి 100 దిర్హాముల వరకు వుంటుంది ఏడాదికి. అత్యధిక ఇన్స్యూరెన్స్ ప్యాకేజీకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. పరిమిత కాలం తర్వాత కూడా ఉద్యోగం దొరక్కపోతే, ఇన్స్యూరెన్స్ పేమెంట్స్ ఆగిపోతాయి. అయితే, ఆ పరిమిత సమయం ఎంత అన్నది ఇంకా వెల్లడి కాలేదు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







