ఎమిరేట్స్‌, ఎతిహాద్‌, ఎయిర్‌ అరేబియా ఆఫర్లు

- April 06, 2016 , by Maagulf
ఎమిరేట్స్‌, ఎతిహాద్‌, ఎయిర్‌ అరేబియా ఆఫర్లు

విమాన ప్రయాణీకులకు శుభవార్త. వివిధ ఎయిర్‌లైన్స్‌ సంస్థలు డిస్కౌంట్‌ ఆఫర్స్‌ని ప్రయాణీకుల కోసం ప్రకటించాయి. బడ్జెట్‌ ఎయిర్‌లైన్స్‌ అయిన ఎయిర్‌ అరేబియా, 48 గంటలపాటు స్పెషల్‌ ఆఫర్‌ని ప్రారంభించింది. 26 డెస్టినేషన్స్‌కి ప్రయాణించేందుకోసం అన్ని పన్నులూ కలుపుకుని 388 దిర్హామ్‌లకే (రిటర్న్‌) ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఏప్రిల్‌ 5 లోపు బుక్‌ చేసుకున్నవారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది. జూన్‌ 10 వరకూ ఈ ధరలో ప్రయాణించే వీలుంది. అతి తక్కువ ధర 399 దిర్హామ్‌లు షార్జా నుంచి అబాదాన్‌ మరియు అల్‌ ఖైమా నుంచి దోహాకు వర్తిస్తుంది. సార్జా నుంచి దోహా, కువైట్‌ మరియు బహ్రెయిన్‌కి 449 దిర్హామ్‌లు, టెహ్రాన్‌కి 449 దిర్హామ్‌లు, కరాచీకి 680 దిర్హామ్‌లు, డామన్‌కి 749 దిర్హామ్‌లు, అలెగ్జాండ్రియా, అమ్మన్‌ మరియు ఇస్తాంబుల్‌కి 849 దిర్హామ్‌లుగా ధర నిర్ణయించారు. ఎమిరేట్‌ ఎయిర్‌లైన్స్‌ ఆఫ్రికా మరియు ఆసియా, పసిఫిక్‌ దేశాల్లోని పలు డెస్టినేషన్లకు ఆఫర్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 7 లోపు టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. నవంబర్‌ 30 వరకు ప్రయాణించే వీలుంది ఈ డిస్కౌంట్‌ ధరతో. ఎతిహాద్‌ ఎయిర్‌ వేస్‌లో 20 మే లోపు టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చని డిస్కౌంట్‌ పీరియడ్‌ని అనౌన్స్‌ చేసింది. నవంబర్‌ 7 లోపు ఈ టిక్కెట్లు చెల్లుబాటు అవుతాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com