ఎంత పని చేశావయ్యా.. మహేషా.! అనుకున్నదొకటి.. అయ్యింది ఇంకోటి.!
- May 12, 2022
సోషల్ మీడియా కల్చర్ పెరిగిపోయాకా, ఏం మాట్లాడినా కష్టమే అయిపోతోంది. ఏమాత్రం టంగ్ స్లిప్ అయినా ఇక అంతే సంగతి. కొంప కొల్లేరే.. సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియా మరీ బోల్డ్గ్గా వ్యవహరిస్తోంది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబును టార్గెట్ చేస్తూ, ఈ మీడియా ఆ మీడియా అనే తేడా లేకుండా ఓ ఇష్యూ పెద్ద రచ్చగా మారింది.
‘బాలీవుడ్ నన్ను భరించలేదేమో..’ అని మహేష్ బాబు చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారమే లేపుతున్నాయి. బాలీవుడ్ అంటే తనకెంతో గౌరవమనీ, కానీ, ఎందుకో తాను బాలీవుడ్‌కి నచ్చనేమో.. అని చాలా క్యాజువల్‌గా మహేష్ చెప్పిన మాటలకు పెడార్ధాలు తీస్తూ, సరికొత్త కాంట్రవర్సీకి తెర లేపారు.
అసలు ఎప్పుడూ కాంట్రవర్సీలకు దూరంగా వుండే మహేష్ బాబు అనుకోకుండా ఈ సారి కాంట్రవర్సీల్లో ఇరుక్కుపోయాడు. ఈ ఇష్యూ ఇప్పుడు బాలీవుడ్ వరకూ వెళ్లిపోయింది. అక్కడి మీడియా కూడా మహేష్ వ్యాఖ్యలపై రచ్చ మొదలెట్టేసింది.
పలువురు బాలీవుడ్ ప్రముఖులు మహేష్‌పై గుర్రుగా వున్నారంటూ వేడి వేడిగా కథనాలు వండి వడ్డించేస్తోంది. ఏ వుద్దేశ్యంతో మహేష్ నోటి వెంట ఈ మాట దొర్లిందో కానీ, తగ్గేదె లే.. అన్నట్లుగా స్ర్పెడ్ అయిపోతోంది. మరి ఈ మాటలకు మహేష్ బాబు ఎలా చెక్ పెట్టనున్నాడో.
మరోవైపు ‘సర్కారు వారి పాట’ రిలీజ్ మేనియా నడుస్తున్న ఈ టైమ్‌లో తాజా కాంట్రవర్సీ పబ్లిసిటీకి ఏమైనా పనికొస్తుందో లేదో చూడాలి మరి.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్‌లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







